ప్రతీ ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు కరోడ్ పతులే
హమారా భారత్.. నా దేశం గొప్పది.. అనుకునేవారు, 'మా ఎంపీలకు సరిరారు ఎవ్వరూ' అని కూడా కొనసాగింపు ఇవ్వవచ్చు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుల్లో 67 శాతం మంది అంటే ప్రతీ ముగ్గురిలో ఇద్దరు కోటీశ్వరులే. 17 శాతం మంది అయితే నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. రాజ్యసభలోని 245 సభ్యుల్లో 227 మందిని పరిగణనలోకి తీసుకుని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ ఈ వివరాలు వెల్లడించింది.
కోట్లలోనూ అందనంత ఎత్తులో ఉన్న రాజ్యసభ సభ్యుల వివరాలు చూస్తే.. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన మహేంద్ర ప్రసాద్(రూ. 683 కోట్లు), స్వతంత్ర అభ్యర్థి విజయ్ మాల్యా(రూ. 615 కోట్లు), సమాజ్ వాదీ పార్టీకి చెందిన జయా బచ్చన్(రూ. 493కోట్లు) కలిగి ఉన్నారు. కేవలం 9 మంది ఎంపీలకు 9 లక్షల రూపాయల్లోపు ఆస్తులు ఉన్నాయి. ఇదీ మన నేతల సంపద!